Header Banner

పంటల మద్దతు ధరలపై మంత్రుల కమిటీ! గత ఏడాదితో పోలిస్తే ఈసారి - 45 నిమిషాలు చర్చ!

  Wed May 21, 2025 14:07        Politics

పంటలకు ధరల్లేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్టు ప్రకటించారు. నల్ల బర్లీ పొగాకును వీలైనంత వరకు వ్యాపారులతో ప్రభుత్వం కొనిపిస్తుందని, అవసరమైతే ప్రభుత్వమే కొంటుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయరంగ సమస్యలు, అన్నదాతల కష్టాలు, పంటల మార్కెటింగ్లో ఇబ్బందులపై సుమారు 45 నిమిషాలు చర్చించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో టీచర్ల బదిలీలు.. ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల! ముఖ్య వివరాలివే..

 

అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో పరిస్థితులు పంటల ధరలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మిర్చి, పొగాకు, కోకో, చెరకు, మామిడితో పాటు, ఆక్వా ఉత్పత్తుల ధరలు తగ్గడానికి కారణాల్ని వివరించారు. ధరల విషయంలో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని, వారికి సాంత్వన చేకూరేలా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వచర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు లాంటి ఎన్నికల హామీలపై, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలోకి తీసుకురావడం లాంటి ఎన్నికల హామీల సాధ్యాసాధ్యాలపై త్వరలో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘంలో జనసేన, భాజపాల నుంచి మంత్రుల్ని సభ్యులుగా నియమించి... ఆ కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations